Frisco వచ్హాడు గోకాడు గిల్లాడు గీకాడు గెలిచాడు…
అస్సలు ఎవడీ Frisco అంకుల్ అనుకుంటున్నారా? ఇతనికి పెద్దగా చదువు, ఆస్తి, టాలెంట్, టైమింగ్ లాంటివి ఏమి లేకున్నా పెద్ద మనస్సు తో, అందమైన వర్ఛస్సుతో ఊరంతా fans ని ఏర్పరచుకున్నాడు…. అని అతనే అనుకుంటాడు కూడా!
అందరి లాగే IT industry లో పని చేస్తాడు, Infrastructure Architect అబ్బోవ్ గత 30 ఏళ్ళ నుంచి technologies పిండేసి గుంజేసాడు, ఒక 3 పుస్తకాలు కూడా రాసాడండోయ్! మీకు కానీ, మీ పిల్లకాలయాలకి కానీ Modern IT Technologies or career advice around them కావాలంటే నన్ను పింగండి (అదే ping చెయ్యండి), తగులుకుంటా!
Hobbies కింద పాటలు పాడతాడు, బొమ్మలు గీస్తాడు, standup కాదు గాని కూచోనే జోకులు ఏసేస్తాడు, ఏవో skits అని కొన్ని ఎలాగబెట్టాడు బానే. అవన్నీ ఈ blog లో పోగుచేస్తాడు, చూసి తరించండి! నచ్చితే, మంచిగా రెండు ముక్కలు comments పెట్టండి, నచ్చ లేదా అట్లాగే చూసి పోతా ఉండండి, చెడ్డగా మాత్రం రాయబాకండి రోయ్…
ఇంకా చెప్పాలంటే రాముడు మంచి బాలుడు, ఉదయము పెందలకడనే లేచును, పండ్లు తోమును, కొంచెం సేపు ముక్కును, కక్క వెళ్ళును, స్నానము చేయును, పూజ చేయును, బాగా మెక్కును, పీకల దాకా తొక్కును, ఆ తరువాత బాగా పని చేయును, మరల మెక్కును, గురక పెట్టి నిద్ర పోవును ఇంకా ఆ తరువాత ఏముంది రా మీ బొంద, మిగతా సైట్ చూడండ్రా తిక్క పకోడాస్!!!