ఈ blog మొదలుపెట్టడానికి గల ముఖ్య కారణమే ఇది. కొంత మంది స్నేహితుల పిల్లలకో లేదా తెలిసిన వాళ్ళ పిల్లలకో ఎంతో కొంత సహాయం చెయ్యడం జరిగింది, అప్పుడు అనిపించింది మనకి తెలిసిన వాళ్ళకి అయితే మనం ఉన్నాం, అలా లేకుండా ఇక్కడికి వచ్చి కష్టపడే పిల్లలకు ఎవరు ఉన్నారు అన్న ఆలోచన నుంచే ఈ అంకుల్ పుట్టాడు….
ఈ అంకుల్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అవ్వాలనే కోరిక తో మిగతా Frisco అంకుల్స ని కూడా కదిలి రమ్మంటున్న, మీ age దాచద్దు, మిమ్మల్ని నలుగురు అంకుల్ అని పిలిస్తే నామోషీగా అనుకోవద్దు, తోటి తెలుగు పిల్లలకు సహాయం చెయ్యండి… రండి రా రండి, మీ లుంగీలు ఎగ్గట్టి రండి!!! అంకుల్ అన్నది బూతు కాదు, అది ఒక యూతు!
మాస్టర్స్ కనీ, ఉద్యోగాల కనీ వచ్చే పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడుతుండడం చూస్తే మనస్సు చివుక్కు మంటోంది, అలాంటి వాళ్ళందరూ మీకు నేను ఏ విధంగా నైనా సహాయం చెయ్య గలిగితే చెప్పండి. Friscoఅంకుల్ ఎప్పుడు తెరుచుకునే ఉంటాడు… అదే తలుపులు అండీ!
త్వరలోనే Irvingఆంటీ అని, Mckinneyమరదలు అని కూడా మొదలు పెడతాము, మీ సమస్యని తీర్చిన తీర్చక పోయిన దీన్ని ఒక ఉద్యమం చేయాలన్నదే నా సంకల్పం!