మన మోగన్ బాబు గారిది ఒక పాట ఉంది కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా అని, దాని చరణం లో “తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న ప్రతిరూపం” అని వస్తుంది, దాన్ని ఒకసారి గమనించండి..
తన బిడ్డ కి వాళ్ళ తేజం, నైజం, రూపం వచ్చింది అని సంతోషంగా, గర్వాంగా పాడతాడు గర్భవతి గా ఉన్న తన భార్య దగ్గర – నాకు అర్ధం కానిది వీడి contribution ఏంటి దాంట్లో?
ఏవిటో ఇలాంటి అవకతవకలన్నీ నాకే వినిపిస్తాయి, కనిపిస్తాయి, నేను లేకపోతే తెలుగు సాహిత్యం ఎటు పోయేదో అన్న అనుమానం కూడా రాకపోదు నాకు అప్పుడప్పుడు…