ఉచితంగా ఇచ్చే దాన్నే సలహా అంటారు…

కెలుక్కుంటే వచేదాన్నే వాసన అంటారు….

ఈ పండెమిక్ తరువాత ప్రతీ వాడు వేమన అయిపోయాడు, ఊరికే కాల్ చెయ్యడం లేదా వాట్సాప్ లో సలహా చెప్తాడు. ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పిండేసిన పాత లుంగీ లాగ ఉన్న నాకు పిల్లల బిహేవియర్ గురుంచి, అమెరికా లో ఇలా ఎందుకున్నారు పిల్లలు అదే మన ఇండియా లో అయితే అని వీడి 35 ఏళ్ళ జీవిత చరిత్ర చెప్తాడు…

“గోక్కోడానికి పుండు లేక నేను ఏడుస్తుంటే
వీడొచ్చి ఆయింట్మెంట్ ఉందా అని అడుగుతాడు”